
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా నిబంధనలు భౌతిక దూరం, లౌక్ డౌన్ వంటివి పాటించకపోతే కరోనా సోకిన వ్యక్తి ద్వారా నెల రోజుల్లో 406 మందికి వైరస్ వ్యాప్తిస్తుందని భారత వైద్య పరిశోధన మండలి నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించడం ఎంతో ముఖ్యమని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అన్నారు.