
తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. సెకండ్ వేవ్ షేక్ చేస్తోంది. ఏప్రిల్ 1న రోజువారి కేసులు వెయ్యిలోపు ఉండగా ప్రస్తుతం 8 వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే ఏప్రిల్ 1న 887 కేసులు, ఏప్రిల్ 5న 1,097, ఏప్రిల్ 10న 2,909, ఏప్రిల్ 20 న 5,926, ఏప్రిల్ 25న 8,125 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.