Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఆనందయ్య మందుకు బళ్లారిలో బ్రేక్

ఆనందయ్య మందుకు బళ్లారిలో బ్రేక్

కరోనా నివారణకు వాడే ఏపీలోని కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి బళ్లారిలో బ్రేక్ పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మందు పంపిణీకి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, దీంతో జిల్లాలో ఆ మందులకు పంపిణీకి అవకాశం ఇవ్వడం లేదని జిల్లా కుటుంబ సంక్షేమ శాఖ అధికారి జనార్దన్ అన్నారు. నాలుగు రోజులుగా కొప్పళ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆనందయ్య మందును స్థానికులు పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారులు ఆ మందు పంపిణీ ని అడ్డుకున్నారు. ఉచితంగా పంపిణీ చేయడం మంచిదే అయినా ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో అడ్డుకున్నట్లు తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular