
విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజి వద్ద నాగావళి నదిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నది. రెండు రోజుల క్రితం తాము ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ప్రేమ జంట సెల్పీ వీడియో తీసి స్నేహితులకు పంపించారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు తోటపల్లి బ్యారేజీ వద్ద వెతగ్గా వారి ఆచూకీ దొరకలేదు. రెండు రోజులుగా గజ ఈత గాళ్ల సాయంతో నాగవళి నదిలో వెతికించగా బుధవారం ఉదయం ఇద్దరి మృతదేహాలు పైకి తేలాయి. దీంతో పోలీసులు వాటిని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.