Papikondalu Trip: ప్రముఖ పర్యాటక ప్రాంతం పాపికొండల విహార యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. భారీ వర్షాలు కారణంగా గోదావరికి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. దీంతో గోదావరి పై లాంచిలతో విహరిస్తే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు. గోదావరికి వరద ఉధృతి తగ్గిన మళ్లీ పాపికొండల విహార యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. కాగా పాపికొండలను దర్శించడానికి దేశ నలుమూలల నుండి నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు.
ఉధృతంగా గోదావరి.. పాపికొండలు విహార యాత్రకు బ్రేక్..
అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
దీంతో పాపికొండలు యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు pic.twitter.com/pBbSEgktjo
— BIG TV Breaking News (@bigtvtelugu) July 11, 2025