400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం వున్న బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగాత్మక పరీక్ష బుధవారం విజయవంతమైంది. దీనిని ఒడిశా లోని ఓ కేంద్రం నుండి పరీక్షంచగా నిర్ధేశిత లక్ష్యాన్ని డీ కొట్టినట్లు తెలిపారు. దీనిని యుద్ధ విమానాలలో, యుద్ధ నౌకలలో, జలాంతర్గాముల నుండి, భూమి ఉపరిమితలం నుండి ప్రయోగించవచ్చు. దీనిని అభివృద్ధిపరచిన శాస్త్రవేత్తల బృందాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అభినందించారు. దేశంలో మొట్ట మొదటి బ్రహ్మోస్ క్షిపణిని రక్షణ దళంలో 2005లో ప్రవేశపెట్టారు.
Also Read: అందరూ నిర్ధోషులైతే బాబ్రీ మసీదును ఎవరు కూల్చారు: ఓవైసీ