https://oktelugu.com/

బిగ్ బాస్ ను నియంత్రిస్తున్న పవన్ ఫ్యాన్స్.. ‘టార్గెట్’ చేస్తే ఎమిలినేటే?

తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్-4’ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3లతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన నిర్వాహాకులు అలరించారు. కరోనా సమయంలోనూ బిగ్ బాస్-4ను ప్రారంభించి.. బుల్లితెర అభిమానులను అలరిస్తున్నారు.ఇప్పటికే బిగ్ బాస్ ప్రారంభమై మూడువారాలు గడిచిపోతుంది. తొలివారం దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ కాగా.. రెండోవారం కరాటే కల్యాణి బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చింది. ఇక కొత్తగా బిగ్ బాస్ హౌజులోకి ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. […]

Written By: , Updated On : September 30, 2020 / 04:31 PM IST
bigboss 4 participants

bigboss 4 participants

Follow us on

bigboss 4 participants

తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్-4’ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3లతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన నిర్వాహాకులు అలరించారు. కరోనా సమయంలోనూ బిగ్ బాస్-4ను ప్రారంభించి.. బుల్లితెర అభిమానులను అలరిస్తున్నారు.ఇప్పటికే బిగ్ బాస్ ప్రారంభమై మూడువారాలు గడిచిపోతుంది. తొలివారం దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ కాగా.. రెండోవారం కరాటే కల్యాణి బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చింది. ఇక కొత్తగా బిగ్ బాస్ హౌజులోకి ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ కమెడీయన్ కుమార్ సాయితోపాటు జబర్డస్త్ కమెడీయన్ అనివాస్ బిగ్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Also Read: అతడి వల్లే సినిమాల్లో నటిస్తున్నానంటున్న అనుష్క…?

ఇక మూడోవారంలో టీవీ-9 యాంకర్ దేవి నాగవల్లి ఎలిమినేషన్ కు గురైంది. అయితే ఈ ఎలిమినేషన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేవి నాగవల్లికి టీవీ-9 యాంకర్ గా ఉన్న ఇమేజ్ కు.. ఆమె వ్యక్తిత్వానికి చాలా తేడా ఉందని ఈ షో తొలి నుంచి చూస్తున్నవారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమెను ఇంత త్వరగా ఎలిమినేషన్ చేయాల్సింది కాదనే టాక్ విన్పిస్తోంది. అయితే ఆమె ఎలిమినేషన్ వెనుక పవన్ అభిమానులు పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ కు.. జనసేన పార్టీని టీవీ9 టార్గెట్ చేస్తూ వార్తలు ఇస్తుండటాన్ని జీర్ణించుకోలేక పవన్ అభిమానులు దేవికి వ్యతిరేకంగా ఓటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అలా టీవీ-9పై కోపంతోనే దేవీని బిగ్ బాస్ హౌజ్ నుంచి సాగనంపేలా ఓటింగులో చక్రం తిప్పారట. దీంతో దేవి బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేషన్ అయిందనే టాక్ విన్పిస్తోంది. ఇక తాజాగా పవన్ అభిమానులు నెక్ట్ టార్గెట్ టీవీ నటుడు సోహెల్ అనే ప్రచారం జరుగుతుంది.

Also Read: సోనూసుద్ ‘క్రేజ్’ ను క్యాష్ చేసుకుంటున్న నిర్మాతలు

సోహెల్ గతంలో ఓ యూట్యూబ్ ఇంటర్వూలో మాట్లాడుతూ తాను జగన్ కు వీరాభిమానినని చెప్పుకున్నాడు. తన తండ్రి కూడా రాజశేఖర్ రెడ్డి అభిమాని అని.. జగన్ మామూలు లీడర్ కాదని.. యూనిక్ అని.. గత ఎన్నికల్లో ఓటమి త్రుటిలో ఓడిన జగన్.. ఈసారి భారీ మెజార్టీతో గెలిచాడని అన్నాడు. ఇక జగన్ అంటే నచ్చని పవన్ అభిమానులు ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టి సోహెలే నెక్ట్ టార్గెట్ అంటూ ట్వీట్లు వేస్తున్నారు. గతంలోనూ పవన్ అభిమానులు బిగ్ బాస్ విన్నర్లను డిసైడ్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇక ఎలిమినేషన్లలోనూ పవన్ అభిమానులు కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తుండటం గమనార్హం.