
బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంపిటెరిసిస్-బి ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన తొమ్మిది మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 28 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. రూ. 7వేలు ఉండే ఒక్కో ఇంజెక్షన్ ను రూ. 35వేల నుంచి 50 వేల వరకు ఈ ముఠా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు నిందితులను వలపన్ని పట్టుకున్నారు.