అమరావతికి రుణమివ్వడంలో బ్యాంకుల మెలిక?

మున్సిపల్ ఎన్నికలకు ముందు అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేయండి, రైతులకు ప్లాట్లలో సదుపాయాలు కల్పించండి అంటూ హడావిడి చేశారు. ఇందుకోసం బ్యాంకుల నుంచి రూ.3 వేల కోట్లు అప్పులు చేయండి అని సెలవిచ్చారు. కానీ ఆచరణలో మాత్రం ఏమి కనిపించడం లేదు.అంతా నిజమే అనుకున్నారు. తీరా ఇప్పుడు ప్రభుత్వం రుణాలకు గ్యారంటీ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. సీఎం ఆదేశించిన ప్రకారం సీఆర్ డీఏ అధికారులు రుణాల కోసం బ్యాంకులను సంప్రదించారు. మూడు బ్యాంకులు కన్సార్షియం […]

Written By: Srinivas, Updated On : June 17, 2021 5:44 pm
Follow us on

మున్సిపల్ ఎన్నికలకు ముందు అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేయండి, రైతులకు ప్లాట్లలో సదుపాయాలు కల్పించండి అంటూ హడావిడి చేశారు. ఇందుకోసం బ్యాంకుల నుంచి రూ.3 వేల కోట్లు అప్పులు చేయండి అని సెలవిచ్చారు. కానీ ఆచరణలో మాత్రం ఏమి కనిపించడం లేదు.అంతా నిజమే అనుకున్నారు. తీరా ఇప్పుడు ప్రభుత్వం రుణాలకు గ్యారంటీ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. సీఎం ఆదేశించిన ప్రకారం సీఆర్ డీఏ అధికారులు రుణాల కోసం బ్యాంకులను సంప్రదించారు. మూడు బ్యాంకులు కన్సార్షియం రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ లో సూచించిన విధంగా కాకుండా ఖర్చుతో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఒక ప్రణాళికను రూపొందించాలని సీఆర్డీఏను గతంలో ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా సీఆర్డీఏ ఒక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి అందించింది.

ఈ ప్రణాళిక ప్రకారం మౌలిక సదుపాయాలు పూర్తి చేసేందుకు 3 వేల కోట్లు బ్యాంకు రుణం తీసుకోవాలని ప్రభుత్వం సీఆర్డీఏకు సూచించింది. ఈ రుణం తీసుకునేందుకు ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరి 23న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మూడు బ్యాంకులు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. కానీ గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం సాకులు వెదుకుతోంది.

ప్రభుత్వం ఇప్పటికే పరిమితికి మించి రుణాలు సేకరించింది. కార్పొరేషన్ల పేరుతోనూ రుణాలు తీసుకుంది. ఇంకా తీసుకోవడానికి మెడికల్ కార్పొరేషన్లు పెడతోంది. ఉన్న కార్పొరేషన్లకు ఆస్తులు బదలాయిస్తోంది. ఇలాంటి సమయంలో బ్యాంకులు వచ్చి గ్యారంటీ అడిగితే అనేక నిబంధనలు పెట్టింది. దీంతో ప్రభుత్వానికే అమరావతి కోసం రుణం తీసుకోవడం ఇష్టం లేదని గుర్తించిన బ్యాంకులు సైలంటయిపోయాయి. మూడు బ్యాంకుల్లో ఒకటి ఇప్పటికే వెనక్కి తగ్గగా మరో రెండు బ్యాంకులు నిబంధనల ప్రకారం గ్యారంటీ ఇస్తే ఆలోచిస్తామని చెబుతున్నాయి.