Bigg Boss 9 Telugu : మరో నెల రోజుల్లో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ ఇంతకు ముందు సీజన్స్ లాగా కాదు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో సామాన్యులు మరియు సెలబ్రిటీల మధ్య పోటీ జరగనుంది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా సామాన్యుడు నిలుస్తాడా?, లేకపోతే సెలబ్రిటీ నిలుస్తాడా అనేది చూడాలి. సామాన్యులను ఎంపిక చేసే ప్రక్రియ ఎలా జరిగిందో మనమంతా చూశాము. కొన్ని లక్షల దరఖాస్తుల ద్వారా 200 మందిని ఎంపిక చేశారు. ఆ 200 మందికి ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్ ని నిర్వహించి కేవలం 42 మందిని మాత్రమే ‘అగ్నిపరీక్ష’ కంటెస్ట్ కి ఎంపిక చేశారు. ఈ అగ్నిపరీక్ష కంటెస్ట్ ద్వారా కేవలం 8 మందిని ఎంచుకొని బిగ్ బాస్ సీజన్ 9 కి పంపుతారు.
ఈ ‘అగ్నిపరీక్ష’ కంటెస్ట్ కి న్యాయనిర్ణేతలుగా బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్(Abhijeet), సీజన్ 1 టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరైన నవదీప్(Navdeep), బిగ్ బాస్ ఓటీటీ సీజన్ టైటిల్ విన్నర్ బిందు మాధవి(Bindhu Madhavi) వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి(Sreemmukhi) యాంకర్ గా వ్యవహరిస్తోంది. నిన్ననే ‘అగ్నిపరీక్ష’ షూటింగ్ మొదలైంది. అభిజిత్ ఈ ప్రక్రియ లో అల్లాడించేశాడని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 లో ఆయన మాస్టర్ మైండ్ గేమ్ ఎలాంటిదో ప్రతీ ఒక్కరు చూశారు. ఒకవిధంగా బిగ్ బాస్ రియాలిటీ షో మీద జనాల్లో ఆసక్తి పెంచడానికి కారణమైన ఇద్దరు ముగ్గురు తోపు కంటెస్టెంట్స్ లో అభిజిత్ ఒకరు. ఆయన మార్కుని ఈ అగ్నిపరీక్ష కంటెస్ట్ లో చూపించారట. ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్ లో పెద్దగా పెర్ఫార్మ్ చెయ్యని వాళ్ళను అగ్నిపరీక్ష కంటెస్ట్ కి ఎంచుకున్నారట. వారిని అభిజిత్, నవదీప్, బిందు మాధవి ఏరిపారేసినట్టు తెలుస్తుంది.
ఎవరెవరికిని ఏరిపారేశారో లిస్ట్ కూడా వచ్చింది. వాళ్ళ పేర్లు ఏమిటంటే సిద్దిపేట మోర్ల, ఉత్తర ప్రసాద్, శ్రీయ వంటి వారు ఎలిమినేట్ అయ్యారట. ఈ ముగ్గురిలో ఒకరు సెలబ్రిటీ అవ్వడం తో, అభిజిత్ నిర్మొహమాటంగా గెటౌట్ అని తరిమేశాడట. ఇక సెలక్షన్ ప్రక్రియ ఒక సరికొత్త పద్దతి ని ఎంచుకున్నారట. గ్రీన్ స్టార్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఒక స్టార్ ఇస్తే ‘పర్లేదు..ఇతని చివర్లో చూద్దాం’ అని హోల్డ్ లో పెట్టినట్టు అట. రెండు స్టార్లు ఇస్తే కొన్ని ప్రత్యేకమైన పవర్స్ ఉంటాయట. మూడు స్టార్స్ ఇస్తే మాత్రం నేరుగా బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ దొరికినట్టే. ఇలా మొదటి రోజు ఒక్క గ్రీన్ స్టార్ ని సొంతం చేసుకున్న కంటెస్టెంట్స్ ఎవరంటే సింగర్ శ్రీతేజ, దమ్ము శ్రీజా, మిస్ తెలంగాణ కష్మీ మరియు హృదయ్. ఇక మిగిలిన అప్డేట్స్ రేపు తెలుస్తాయి.