Bigg Boss Telugu Season 9 promo : బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) మరో నెల రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే రెండు ప్రోమోలను విడుదల చేశారు. నేడు కాసేపటి క్రితమే ఈ సీజన్ కాన్సెప్ట్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తో పాటు ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్(Vennela Kishore) ని కూడా మనం చూడొచ్చు. ఇంతకీ ఈ ప్రోమో ద్వారా జనాలకు సీజన్ 9 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు?, వాళ్ళు అనుకున్న విధంగానే ఈ సీజన్ ఉంటుందా లేదా అనేది విశ్లేషిద్దాం. ప్రోమో మొదలవ్వగానే వెన్నెల కిషోర్ కారులో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న సమయం లో ఆయన పేపర్ చదువుతూ అందులో బిగ్ బాస్ కి సంబంధించిన యాడ్ ని చూస్తాడు.
ఆ తర్వాత ఆయన ఫోన్ లో మాట్లాడుతూ ‘శ్యామల గారు..నా తదుపరి షూటింగ్ షెడ్యూల్స్ వంద రోజుల వరకు క్యాన్సిల్ చేసేయండి..కొత్త ప్లాన్ ఉంది..బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్లాలని అనుకుంటున్నాను’ అని అంటాడు. అది విన్న డ్రైవర్ వెంటనే సడన్ బ్రేక్ వేసి కారుని ఆపుతాడు. ‘ప్లానింగ్ ఉంటే సరిపోదు సార్..9 గ్రహాల ఆశీర్వాదం కూడా ఉండాలి’ అని డ్రైవర్ వెన్నెల కిషోర్ తో అంటాడు. మరి ఆ గ్రహాల ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని వెన్నెల కిషోర్ అడగ్గా, కమాండింగ్ ఫ్రెండే ఒకడు ఉన్నాడు అని సమాధానం చెప్తాడు. అనంతరం వెన్నెల కిషోర్ ఆ కమాండింగ్ ఫ్రెండ్ దగ్గరకి వెళ్తాడు. ఆయన ఉండే ప్రదేశం మొత్తం కొత్తగా ఉంటుంది. వెన్నెల కిషోర్ ని చూడగానే నాగార్జున ‘హేయ్ కిషోర్’ అని అంటాడు. వెన్నెల కిషోర్ ఆశ్చర్యపోతూ మీరా అని అడుగుతాడు. ‘బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి వచ్చావా’ అని నాగార్జున అడగ్గా, దానికి వెన్నెల కిషోర్ ‘వెళ్ళడానికి ఏలడానికి వచ్చాను’ అని సమాధానం చెప్తాడు.
అప్పుడు నాగార్జున ‘అది నీ వల్ల కాదులే..ఈసారి చాలా టఫ్’ అని అంటాడు. అప్పుడు వెన్నెల కిషోర్ ‘నేను చాలా రఫ్’ అని అంటాడు. ఇంతకీ నీ బలం ఏంటి అని నాగార్జున అడగ్గా, దానికోయ్ వెన్నెల కిషోర్ ‘ఎంటర్టైన్మెంట్ లో కింగ్ ని..అమ్మాయిలకు మన్మదుడుని..అబ్బాయిలకు మాస్..ఊర మాస్’ అని అంటాడు. అసలు ఈ హౌస్ గురించి తెలుసుకున్నావా?, అని అడగ్గా, ‘తెలుసుకోవడానికి ఏమి ఉంది..ఇది డ్రీం హౌస్ కావొచ్చు..కానీ కేవలం ఒకే ఒక్క హౌస్’ అని అంటాడు. అప్పుడు నాగార్జున ‘ఈసారి ఒక్క హౌస్ కాదు..రెండు ఉంటాయి’ అని అంటాడు. అంటే సామాన్యులకు ఒకటి, సెలబ్రిటీలకు ఒక హౌస్ నా అని అడుగుతాడు వెన్నెల కిషోర్, త్వరలోనే చూద్దువులే అని నాగార్జున అంటాడు. నేను డైరెక్ట్ గా బిగ్ బాస్ తోనే మాట్లాడుకుంటా అని వెన్నెల కిషోర్ అనగా, అందుకే బిగ్ బాస్ ని కూడా మార్చేసాం అని అంటాడు నాగార్జున. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈసారి రెండు బిగ్ బాస్ హౌస్ లు ఉంటాయి అని. పూర్తి ప్రోమో ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.