Bharta Mahasyulaku Vignapti : మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) చాలా కాలం తర్వాత తన ఇమేజ్ కి పూర్తి భిన్నంగా చేసిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bharta Mahasyulaku Vignapti) చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతున్న సందర్భంగా నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ని జారీ చేశారు. ప్రస్తుతం సంక్రాంతికి విడుదల అవ్వబోతున్న సినిమాల్లో, ఆడియన్స్ లో అసలు ఏ మాత్రం హైప్ లేని చిత్రం ఇదే. ఎందుకంటే రవితేజ కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడమే అందుకు కారణం. టీజర్, ట్రైలర్ , పాటలు ఆకట్టుకున్నాయి. అయినప్పటికీ కూడా ఈ సినిమాపై ఆడియన్స్ పై ఎలాంటి ఆసక్తి కలిగించలేదు. సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిన రవితేజ సినిమాకు, ఇలాంటి దుస్థితి వస్తుందని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఇప్పటి వరకు కలలో కూడా ఊహించి ఉండరు.
అయితే సెన్సార్ నుండి వస్తున్న టాక్ ఏమిటంటే , ఈ సంక్రాంతికి విడుదల అవ్వబోయే సినిమాల్లో కేవలం రెండు సినిమాలు మాత్రమే కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్స్ అవుతాయని, ఆ రెండిట్లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రం కూడా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రానికి ఓపెనింగ్ వసూళ్లు పెద్దగా ఏమి ఉండకపోవచ్చు, కానీ లాంగ్ రన్ లో ఆడియన్స్ అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసే చిత్రం గా నిలుస్తుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మరియు సెకండ్ హాఫ్ లలో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ చాలా చక్కగా కుదిరిందని , రవితేజ కం బ్యాక్ సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. ముఖ్యంగా కమెడియన్ సత్య, సునీల్, వెన్నెల కిషోర్ లతో రవితేజ కామెడీ ట్రాక్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిల్చింది అట. ఇక సునీల్ లో వింటేజ్ కామెడీ టైమింగ్, వింటేజ్ బాడీ లాంగ్వేజ్ ని ఈ సినిమాలో చూడబోతున్నాం అన్నమాట.
అంటే సొంతం సినిమాలో సునీల్ ఎలా ఉండేవాడో, అలా అన్నమాట. ఈ చిత్రం కోసం రవితేజ ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. సినిమా విడుదలయ్యాక లాభాల్లో వచ్చే వాటాలను పంచుకుందాం అని మాత్రమే చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతలు ప్రెస్ మీట్ లో చెప్పారు. ఒకానొక సమయం లో పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న చరిత్ర రవితేజ ది. అలాంటి హీరో ఇప్పుడు పైసా రెమ్యూనరేషన్ తీసుకోకుండా పని చేసే రోజు వచ్చిందంటే ఎంత బాధాకరమైన విషయంలో మీరే చూడండి. సెన్సార్ సభ్యులు చెప్పినట్టుగానే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి కూడా పాజిటివ్ టాక్ వచ్చి రవితేజ కి కం బ్యాక్ అయ్యేలా ఉండాలని ఆశిద్దాం.