The Raja Saab Collections : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, ప్రభాస్ కి ఉన్నటువంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ పవర్ కారణంగా ఈ చిత్రానికి మొదటి రెండు రోజులు చాలా బలమైన వసూళ్లు నమోదు అయ్యాయి. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి నమోదు అవుతున్న వసూళ్లు, మిగిలిన స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల వసూళ్లతో సమానంగా ఉంది. రెండవ రోజు ఈ చిత్రానికి నైజాం ప్రాంతం లో రిటర్న్ జీఎస్టీ కలిపి 5 కోట్ల 78 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఇప్పటి వరకు ఏ హీరో ఫ్లాప్ సినిమాకు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రాలేదు అంటే అతిశయోక్తి కాదేమో. కేవలం నైజాం ప్రాంతం లోనే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా ఈ చిత్రానికి రెండవ రోజు డీసెంట్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రెండవ రోజు 11 కోట్ల 93 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నైజాం లో రెండవ రోజు ఎంత వసూళ్లు వచ్చాయో పైన మీరు చూసే ఉంటారు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతం నుండి ఈ చిత్రానికి కోటి 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి కోటి 47 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, తూర్పు గోదావరి జిల్లా నుండి 70 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 54 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కృష్ణా జిల్లా నుండి 74 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది .
ఓవరాల్ గా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండవ రోజు 11 కోట్ల 93 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే, అంత మంచిది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రీమియర్స్ + మొదటి రోజు తర్వాత ఇక్కడ నుండి వసూళ్లు రావడం కరువు అయ్యింది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 52 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రెండు రోజులకు కలిపి 83 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 132 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఎంతమేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.