8 seater cars India :కార్లు కొనే విషయంలో చాలామందికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. కొందరికి విశాలమైన స్పేస్ ఉండే పెద్ద కార్లు కావాలని కోరుకుంటారు. మరికొందరు మైలేజ్ ఎక్కువగా ఇచ్చే చిన్న కార్లైనా సరే అని సరిపెట్టుకుంటారు. అయితే ఈ రెండు రకాల సౌకర్యాలు ఒకే కారులో ఉంటే వాటికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అలాంటి సౌకర్యాలు కొన్ని కారులో ఉన్నాయి. ఒకవైపు విశాలమైన స్పేస్ ఉండడంతో పాటు మరోవైపు మంచి మైలేజ్ ఇచ్చే కార్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇవి 8 సీటర్ కారు కూడా కావడంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఇంతకీ ఇలాంటి సౌకర్యాలు ఉన్న ఆ కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
Toyota కంపెనీకి చెందిన ఇన్నోవా ఐ క్రాస్ కారు విశాలమైన స్పేస్ ను కలిగి ఉంటుంది. ఈ మోడల్ మొత్తం 20 వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8 సీటర్ కలిగిన దీని ధర రూ.19.5 లక్షల ప్రారంభం నుంచి రూ.32 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇందులో రెండు రకాల ఇంజన్ లో ఉండలున్నాయి. వీటిలో ఒకటి టూ లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ లీటర్కు 23.24 కిలోమీటర్ల మైలేజ్ నీ అందిస్తుండగా.. ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో కలిగిన మరో ఇంజన్ కూడా ఇందులో చూడొచ్చు. ఈ కారులో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంపార్టైన్మెంట్ సిస్టం తో పాటు 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉండనుంది. అలాగే పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 360 డిగ్రీ కెమెరా, ADAS టెక్నాలజీని కలిగి ఉంది.
అలాగే మారుతి సుజుకి కంపెనీకి చెందిన Invicto కారు కూడా విశాలమైన స్పేస్ తో పాటు మంచి మైలేజ్ నీ అందిస్తుంది. ఈ మోడల్ 3 అందుబాటులో ఉండనుంది. దీనిని రూ.24.97 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.28.61 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ కారులోను హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ను చూడొచ్చు. ఇది ఇన్నోవా ఐక్రాస్తో సమానంగా ఉంటుంది. ఈ ఇంజన్ పై లీటర్ ఇంధనానికి 23.24 కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తుంది. ఇందులో 10.1 అంగుళాల టక్స్ క్రీం ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో పాటు పనోరమిక్ సన్ రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి.
ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో ఈ రెండు కార్లు ఆకట్టుకుంటున్నాయి. అయితే మైలేజ్ తో పాటు విశాలమైన కారు కావాలనుకుంటే ధర కాస్త ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది.