Bengaluru New Year Celebrations : దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31 నాడు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. దేశ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. నగరాలలో యువత మద్యం తాగి.. చిందులు వేశారు. దేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరులో అయితే డిసెంబర్ 31 వేడుకలు అంబరాన్ని తాకాయి.
బెంగళూరులో ప్రతి ప్రాంతం కూడా రద్దీగా మారింది. పలువురు నిర్వాహకులు డిసెంబర్ 31 వేడుకలను ప్రత్యేకంగా జరిపారు. ఈ వేడుకల్లో చెవులు బద్దలయ్యే మ్యూజిక్… రకరకాల బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంచారు. పలు ఐటీ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు సెలవులు పెట్టి.. డిసెంబర్ 31 వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పీకల దాకా మద్యం తాగి.. నాలుకకు నచ్చిన రుచులను ఆస్వాదించి.. పండగ చేసుకున్నారు. మద్యం తాగిన వారిలో యువకులు మాత్రమే కాదు, యువతులు కూడా ఉన్నారు. యువతులు పీకలదాకా మద్యం తాగి.. మ్యూజిక్ కు అనుకూలంగా స్టెప్పులు వేశారు. కొందరైతే కిక్కు ఎక్కువై అక్కడే పడుకున్నారు. కొందరు తాగిన మైకంలో గొడవలు పెట్టుకున్నారు.
బెంగళూరు నగరంలోని ఓ పబ్ లో ఓ యువతి పీకలదాకా మద్యం తాగింది. తాగిన మైకంలో రచ్చ రచ్చ చేసింది.. అంతేకాదు వద్దని వారించిన భాయ్ ఫ్రెండ్ పై దాడికి దిగింది. అతడిని తిడుతూ.. విచిత్రంగా ప్రవర్తించింది. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్నప్పటికీ.. ఆమె తన స్నేహితుడిపై దాడిని మాత్రం ఆపలేదు. కురచ దుస్తులు వేసుకున్న ఆ యువతి.. తన శరీరం మీద ఏమాత్రం అదుపు లేకుండా వ్యవహరించింది. స్నేహితులపై దాడికి పాల్పడడమే కాకుండా, బండ బూతులు తిట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. ఆ యువతి విపరీతంగా మద్యం తాగడంతో ఇలా వ్యవహరించిందని స్థానికులు చెబుతున్నారు.
కేవలం ఆ పబ్ లో మాత్రమే కాదు, ఇంకా చాలా చోట్ల ఈ తరహ సంఘటనలు జరిగాయి. ఇందులో కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. అయితే దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని బెంగళూరు పోలీసులు వెల్లడించారు.. ఈ ఘటనపై పబ్ నిర్వాహకుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
