Mana Shankara Varaprasad Gaaru : అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమా అంటే ఆయన అభిమానులు కచ్చితంగా ప్రొమోషన్స్ వేరే లెవెల్ లో ఉంటాయని ఆశిస్తారు. ఎందుకంటే తన ప్రతీ సినిమాతో ప్రొమోషన్స్ విషయం లో ఆయన సెట్ చేసిన స్టాండర్డ్స్ అలాంటివి మరి. అయితే ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న అనిల్ కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Gaaru) చిత్రానికి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రొమోషన్స్ ని మొదలు పెట్టలేదు. మెగాస్టార్(Megastar Chiranjeevi) సినిమాకు ప్రొమోషన్స్ తో పనేముంది అని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ, మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం బాగా నిరాశకు గురయ్యారు. అయితే కాసేపటి క్రితమే అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఒక ఫన్నీ వీడియో చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసాడు. దీన్ని చూసి ఇదా కదా మేము మీ నుండి కోరుకున్నది అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్రం లో హీరోయిన్ గా నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాలో నటించినా నయనతార ప్రొమోషన్స్ లో పాల్గొనడానికి ఇష్టపడడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. అలాంటి నయనతార తో సినిమా ప్రారంభం అయ్యేటప్పుడు ఒక ప్రమోషనల్ వీడియో చేయించి అందరినీ షాక్ కి గురి చేసాడు అనిల్ రావిపూడి. ఆమ్మో, నయనతార తోనే ప్రొమోషన్స్ మొదలు పెట్టావంటే నువ్వు మామూలోడివి కాదు బాసూ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు షూటింగ్ మొత్తం పూర్తి అయ్యాక కూడా అనిల్ రావిపూడి నయనతార తోనే ప్రొమోషన్స్ ని మొదలు పెట్టాడు. కాసేపటి క్రితమే ఆయన విడుదల చేసిన వీడియో అభిమానుల చేత నవ్వులు పూయించింది.
ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే, అనిల్ రావిపూడి తన అసిస్టెంట్ డైరెక్టర్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే నయనతార ఆయన వద్దకు వచ్చి, ఏం అనిల్, సినిమా షూటింగ్ మొదలైనప్పుడు నా చేత ప్రమోషనల్ వీడియో చేయించావ్, ఇప్పుడు షూటింగ్ అయిపోయింది, ఇప్పుడు ప్రొమోషన్స్ ఏమి లేవా అని అడుగుతుంది. నయనతార స్వయంగా వచ్చి ప్రొమోషన్స్ కోసం అడగడంతో అనిల్ రావిపూడి కళ్ళు తిరిగి క్రింద పడిపోతాడు. ఆ తర్వాత పక్కకి వెళ్లి తనని తానూ గిల్లుకొని, ఇది నిజామా కాదా?, హా నిజమేలే!, అని అనుకొని, నయనతార వద్దకు వెళ్లి ‘మీ అంతటా మీరే ప్రొమోషన్స్ కోసం అడిగారు, అది చాలు మేడం మాకు, మీరు కేవలం మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12 న విడుదల అవ్వబోతుంది అని చెప్తే చాలు, అదే మాకు ప్రొమోషన్స్’ అని అంటాడు. సోషల్ మీడియా లో నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.