దేశంలో కరోనా కల్లోల సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించిన బీసీసీఐకీ రూ. 1000కోట్ల జరిమానా విధించాలని బాంబే హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా భారత్ లో కరోనా మరణాలు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని ఐపీలఎల్ 2021 ను రర్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను పరిశీలించడానికి బాంబే కోర్టు మంగళవారం అంగీకరించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బీసీసీఐకి రూ. 1000 కోట్ల పైన్ వేయాలని అలాగే ఐపీఎల్ ద్వారా వచ్చే లాభాలను కరోనా చికిత్స కోసం జౌషధాలు, మెడికల్ ఆక్సిజన్ సరఫరా కోసం ఉపయోగించేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఐపీఎల్ 14 వ సీజన్ ను బీసీసీఐ రద్దు చేసింది.