
కృష్ణాజిల్లా మచిలీపట్నం డాబాలసెంటర్ లో ఆవు దూడకు బారసాల నిర్వహించడం అందరినీ ఆకర్షించింది. ఇటీవల జన్మించిన ఓ ఆవు దూడకి ఘనంగా బారసాల నిర్వహించారు మైధిలి అనే రైతు. గత నెల జూలై 6 తేదీన మైధిలి పెంచుకున్న ఆవు కి దూడ పుట్టింది. సాధారణంగా మనుషులకు చేసే నెలలోపు ఉయ్యాల వేడుకను ఆవు దూడకు నిర్వహించారు. తల్లి గోవు గర్భిణీగా ఉన్న సమయంలో సీమంతం కూడా నిర్వహించినట్లు గోవు యజమాని మైథిలి తెలిపారు.