ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడ్తామంటున్నారు. దమ్ముంటే నా మీద రాజద్రోహం కేసు పెట్టాలి అని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. మక్కలు, వడ్లు కొనకపోతే కొనేటట్లు బీజేపీ కెసిఆర్ మెడలు వంచుతది. పోడు భూముల మీద కొట్లాడితే మా మీద కేసులు పెట్టారు. అయినా పోడు భూముల విషయంలో వెనక్కి తగ్గేది లేదు. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా అసలైన ప్రజా సమస్యలు చర్చకు వస్తున్నాయి కాబట్టి, నేను ప్రజా సమస్యల పై సీఎం కు ఛాలెంజ్ లు విసురుతున్నా కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఉనికిని చాటడానికి కొనఊపిరితో ఉన్న పార్టీకి నాయకుడిగా ఉన్న ఒకాయన పనికో రాని ఛాలెంజ్ విసిరితే టైంపాస్ చేయడానికి అధికార పార్టీ నాయకుడు హంగామా చేస్తున్నాడు. ఎవరెవరు ఒకటి అనేది దీనితో ప్రజలకు స్పష్టంగా అర్ధం అవుతూంది. ఈ వైట్ ఛాలెంజ్ తో పేద ప్రజలకు ఎం సంభంధం? బాగా బలిసినోడు బలుపు ఎక్కినోడు డ్రగ్స్ తీసుకుంటారు. బండి సంజయ్ వైట్ బ్లాక్ పింక్ గ్రీన్ ఆరంజ్.. ఏ ఛాలెంజ్ కి అయినా వెనక్కి పోను.కానీ పర్సనల్ ఛాలెంజ్ లతో ప్రజలకు ఒరిగేది ఏం లేదని అన్నారు.