https://oktelugu.com/

Bandi Sanjay: 29వ రోజుకు చేరిన బండి సంజయ్ పాదయాత్ర

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 29వ రోజుకు చేరుకుంది. ప్రజలను కలుస్తూ.. సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇతర ప్రతి పక్షాల పై ఫైర్ అవుతూ ముందుకు సాగుతున్నారు. బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేక పోతున్నారని ప్రజలకు వివరిస్తున్నారు. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాలు భూమి, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలుపై బండి సంజయ్ పోరాటం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 25, 2021 / 09:29 AM IST
    Follow us on

    బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 29వ రోజుకు చేరుకుంది. ప్రజలను కలుస్తూ.. సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇతర ప్రతి పక్షాల పై ఫైర్ అవుతూ ముందుకు సాగుతున్నారు. బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేక పోతున్నారని ప్రజలకు వివరిస్తున్నారు. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాలు భూమి, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలుపై బండి సంజయ్ పోరాటం చేస్తున్నారు.  ఇంటికో ఉద్యోగం ఇవ్వకపాయే- నిరుద్యోగ భ్రుతి ఏమాయే అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ నల్ల కండువా ధరించి నేడు పాదయాత్ర చేయనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.

    ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి ఇవ్వనందుకు నిరసనగా నేడు ‘ప్రజా సంగ్రామ యాత్ర’లో నల్ల కండువాలు ధరించి బండి సంజయ్ తోపాటు నిరసన తెలపనున్న వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు.  నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు నిరసనగా నల్ల కండువాలు ధరించి బండి సంజయ్ తోపాటు పాదయాత్రలో నిరసన తెలపనున్న వేలాది మంది బీజేవైఎం కార్యకర్తలు.

    29వ రోజు ‘ప్రజా సంగ్రామ యాత్ర’లో బండి సంజయ్ తో కలిసి పాదయాత్రలో పాల్గొననున్న కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా, మాజీ ఎంపీ విజయశాంతి. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ముస్తాబాద్, గన్నేపల్లి, సేవాలాల్ తండా, అంకిరెడ్డిపల్లె, సారంపల్లిలో కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర నేటి సాయంత్రం అంకిరెడ్డి పల్లెలో జరిగే బహిరంగ సభలో  బండి సంజయ్, పురుషోత్తం రూపాల, విజయశాంతి ప్రసంగిస్తారు.