
Mahesh Babu: టాలీవుడ్ నే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ తీసుకున్నా..అంత్యంత అందమైన హీరో ఎవరంటే మన మహేష్ బాబు పేరే చెబుతారు. చంద్రుడికి కూడా కొన్ని మచ్చలుంటాయి.. కానీ మహేష్ బాబుకు మాత్రం అలాంటివేవీ లేవంటారు. ఒక హాలీవుడ్ హీరోలా మహేష్ అందం చందం ఉంటాయి. మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా పేరు పొందాడు. ఇప్పటికీ ఆడవాళ్ల కలల రాకూమారుడిగా కొనసాగుతున్నారు. సినిమా సినిమాకు మహేష్ అందం పెరుగుతుందే కానీ.. తరగడం లేదు. ఎనర్జీని పెంచుకుంటూ మహేష్ బాబు పోతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు అంత అందంగా.. ఎనర్జీగా ఉండడానికి కారణం ఏంటి? ఆ సీక్రెట్ ఏంటనేది తాజాగా బయటపడింది.
మహేష్ బాబు తాజాగా బిగ్ సీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన తొలి హీరో మహేష్ కావడం విశేషం. ఇప్పటికే రాంచరణ్, ఎన్టీఆర్ సైతం పలు ఫోన్ అమ్మే బ్రాండింగ్ కంపెనీలకు ప్రచారం చేస్తున్నారు. తాజాగా మహేష్ కూడా ఆ లిస్టులో చేరారు.
‘బిగ్ సి’ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన నేపథ్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు మహేష్ బాబు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తన సినీ కెరీర్, పర్సనల్ కు సంబంధించిన విశేషాలను మహేష్ పంచుకున్నారు.
రాజమౌళితో సినిమా చేయడం తన కల అని.. అది త్వరలోనే నిజమవుతోందని తెలిపారు. ఇక తన కెరీర్ లో నటించిన అన్ని సినిమాల్లో అన్నింటికంటే ‘పోకిరి’ తనకు ఇష్టమైన సినిమా అని మహేష్ బాబు సంచలన విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చేస్తున్న ‘సర్కారివారి పాట’ మూవీ పోకిరికి ఏమాత్రం తగ్గదు అని చెప్పుకొచ్చాడు.
ఇక మహేష్ బాబు ఇంత అందంగా.. ఎనర్జీగా ఉండడానికి కారణం ఏంటన్న ప్రశ్నకు సమాధానమిచ్చాడు. తన సీక్రెట్ ను బయటపెట్టాడు. ‘నేను ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. బహుశా అదే నా ఎనర్జీకి కారణమై ఉంటుంది. అలాగే తన జీవితంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటాను. ఏ విషయాన్ని అయినా పెద్దగా ఆలోచించను. అదే నా ఎనర్జీ సీక్రెట్’ అంటూ చెప్పుకొచ్చారు.
వెబ్ సిరీస్ లు అద్భుతమైన ఐడియాలతో వస్తున్నాయని.. ఇప్పటికిప్పుడు నేను చేసే ఆలోచన లేకపోయినా ఎవరికి తెలుసు.. భవిష్యత్తులో చేయవచ్చని మహేష్ బాబు సంచలన విషయాలు పంచుకున్నారు.
ఇలా మహేష్ బాబు అందానికి, ఎనర్జీకి అసలు కారణం ‘ఆనందం’ అన్న మాట చెప్పడంతో సీక్రెట్ రివీల్ అయ్యింది. అంత ఆనందంగా ఉంటాడు కాబట్టే అంత అందంగా ఉంటున్నాడన్న విషయం తేటతెల్లమైంది.
