Jana Nayagan Vs Bhagavanth Kesari: తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న నటుడు విజయ్…ప్రస్తుతం ఆయన జన నాయకుడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బాలయ్య బాబు హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక రీసెంట్ గా ట్రైలర్లో విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ పెద్దగా మెప్పించలేదనే చెప్పాలి. బాలయ్య బాబు భగవంత్ కేసరి సినిమాలో ఎలాంటి పవర్ ఫుల్ డైలాగ్లు చెప్పి ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేశాడో విజయ్ అలాంటి ఒక అటెన్షన్ ను తీసుకురాలేకపోయాడు. కారణం ఏదైనా కూడా విజయ్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధించడం చాలా కష్టమనే చెప్పాలి.
తన చివరి సినిమా అనే సెంటిమెంట్ తో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాను చూస్తాడేమో కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆ సినిమాకు ఆదరణ దక్కదనే చెప్పాలి. భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ ఆరా ను చూసిన ఏ ఒక్కరికి యాక్టింగ్ అయితే నచ్చకపోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు చూడకపోవడమే బెటర్…
ఎందుకంటే భగవంత్ కేసరి సినిమా మీద ఉన్న ఇంప్రెషన్ కూడా జననాయకుడు సినిమా చూస్తే పోతుందేమో అనే ఉద్దేశ్యంతో చాలామంది ప్రేక్షకులైతే ఉన్నారు… భగవంత్ కేసరి సినిమాను మించి ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక జన నాయకుడు సినిమా రాజాసాబ్ సినిమాతో పోటీగా జనవరి 9 వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి లేని క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ రాజాసాబ్ మూవీ తో మరోసారి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. విజయ్ జన నాయకుడు సినిమాకు తెలుగులో పెద్దగా ఆదరణ దక్కదనేది వాస్తవం. విజయ్ ఈ మూవీతో ఏ మేరకు సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా విజయ్ తన చివరి సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలుపుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…