Redmi Note 15 5G: భారత మొబైల్ మార్కెట్‌లో మంచి వాటాదారు రెడ్‌మీ. తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లతో మొబైల్స్ అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. మార్కెట్‌లో పోటీ ఎదుర్కొని నిలదొక్కుకుంటోంది. తాజాగా రెడ్‌మీ మరో కొత్త మొబైల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. రెడ్‌మీ నోట్ 15 5జీ సిరీస్‌ను వచ్చేవారం భారత్‌లో అందుబాటులోకి రాబోతోంది. 108 మెగా పిక్సెల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో స్మార్ట్‌ఫోన్ ప్రియుల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించారు. అమెజాన్, రెడ్‌మీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
లాంచ్ తేదీ – అంచనా ధరలు
జనవరి 6న ఉదయం 11 గంటలకు అధికారిక విడుదల కానుంది. ఇక ధర విషయానికి వస్తే.. 8జీబీ ర్యామ్ + 128జీబీ ధర రూ.22,999గా, 8జీబీ ర్యామ్ + 256జీబీ: రూ.24,999గా నిర్ణయించారు. పోలాండ్‌లో లాంచ్ ధర రూ.30 వేలకు సమానం. భారత్‌లో పోటీతో ధర తగ్గించే అవకాశం కూడా ఉంది.
ఆకర్షణీయ డిజైన్..
బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్లు. కరవ్డ్ బాడీ, స్క్విర్కిల్ కెమెరా మాడ్యూల్ ప్రీమియం లుక్ ఇస్తాయి. 6.77 ఇంచ్ కరవ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ బ్రైట్‌నెస్. టీయూవీ ఐకేర్, హైడ్రో టచ్ 2.0 ఫీచర్లు కళ్లు, తడి చేతుల సమస్యలను పరిష్కరిస్తాయి. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో 30% సీపీయూ, 10% జీపీయూ మెరుగులు ఉన్నాయి. హైపర్‌ఓఎస్ 2, ఐపీ 66 రేటింగ్ డస్ట్, వాటర్ నుంచి రక్షిస్తాయి.
లాంగ్–లాస్టింగ్ బ్యాటరీ
5,520 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్. ఒక్కసారి ఛార్జ్‌తో 1.5 రోజులు, 5 సంవత్సరాల వరకు నాణ్యత హామీ. ఇక పోన్ లవర్స్ కోరుకునే మరో ఫీచర్ కెమెరా. ఇందులో 108 మెగా పిక్సెల్స్ మెయిన్ సెన్సార్, 4కే వీడియో, ఓఐఎస్ సపోర్ట్, మాస్టర్ పిక్సెల్ ఎడిషన్ ఫొటోగ్రఫీకి ప్రత్యేకం. 8 ఎంపీ సెకండరీ, 20 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.
మొత్తంగా రెడ్మీ నోట్ 15 5జీ సిరీస్ మిడ్–రేంజ్ సెగ్మెంట్‌లో ఆకట్టుకునేలా రూపొందించారు.