Bhadrachalam Ramalaya EO: భద్రాచలం రామాలయ ఈవోపై దాడి జరిగింది. భద్రాచలం రామాలయ భూములు పురుషోత్తపట్నం (ఏపీ)లో కబ్జాకి గురవుతుండగా ఈవో రమాదేవి కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆక్రమణదారులు ఈవో రమాదేవిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆలయ ఈవో స్పృహ తప్పి పడిపోయారు. గత కొద్దిరోజులుగా ఆక్రమణదారులకు, దేవాదాయ శాఖ ఉద్యోగులకు మధ్య వివాదం జరుగుతుంది. అప్రమత్తమైన స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బ్రేకింగ్ న్యూస్
భద్రాచలం రామాలయ ఈవోపై దాడి
భద్రాచలం రామాలయ భూములు పురుషోత్తపట్నం (ఏపీ)లో కబ్జాకి గురవుతుండగా అడ్డుకున్న ఈవో రమాదేవి
ఈవో రమాదేవిపై దాడి చేసిన ఆక్రమణదారులు.. స్పృహ తప్పి పడిపోయిన రమాదేవి
గత కొద్దిరోజులుగా ఆక్రమణదారులకు, దేవాదాయ శాఖ ఉద్యోగులకు మధ్య వివాదం… pic.twitter.com/cQhF01tkOR
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025