Gowtham Krishna Update: బిగ్ బాస్ రియాలిటీ షో హిస్టరీ లో ప్రత్యేకమైన మార్కు ని వేసిన కంటెస్టెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువమందిలో ఒకరే గౌతమ్ కృష్ణ(Gowtham Krishna). సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి , చివరి వారం వరకు కొనసాగి ఎలిమినేట్ అయిన గౌతమ్, సీజన్ 8(Bigg Boss 8 Telugu) లో వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చి టాప్ 2 కంటెస్టెంట్ గా మిగిలాడు. ఈ రెండు సీజన్స్ లో గౌతమ్ ఆడిన ఆట తీరుకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ‘అశ్వర్థామా ఈజ్ బ్యాక్’,’అశ్వర్దమా 2.O’ వంటి పదాలు తెలుగు రాష్ట్రాల్లో బాగా హైలైట్ అవ్వడానికి కారణం ఇతనే. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లిన తర్వాత ఇతని పరిస్థితి ఏమిటి?, సినిమాల్లో కానీ, సీరియల్స్ లో కానీ అవకాశాలు సంపాదిస్తున్నాడా లేదా అని మీరు అనుకోవచ్చు.
‘బిగ్ బాస్ 7 ‘ సమయం లోనే ఆయన ‘సోలో బాయ్'(Solo Boy Movie) అనే చిత్రాన్ని సగానికి పైగా పూర్తి చేశాడు. ఈ చిత్రం లో ఆయన హీరో గా నటించడమే కాదు,స్క్రిప్ట్ రైటర్ గా కూడా వ్యవహరించాడు. సీజన్ 8 లోకి వచ్చే ముందు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని మొత్తం పూర్తి చేసి రీసెంట్ గానే జులై 4 న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేశారు. రెస్పాన్స్ బలంగా వస్తుందని గౌతమ్ ఆశించాడు కానీ, కనీసం ఈ సినిమా విడుదల అయ్యింది అనే విషయం కూడా చాలా మందికి తెలియలేదు. అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రం ద్వారా ‘బిగ్ బాస్’ తో వచ్చే క్రేజ్ కేవలం ఆ షో వరకే పరిమితం అవుతుంది, సినిమాలకు ఉపయోగపడదు అని మరోసారి రుజువు అయ్యింది.
Also Read: భద్రాచలం రామాలయ ఈవోపై దాడి.. వీడియో వైరల్
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కేవలం మూడు రోజులకు కలిపి కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. ఈ సినిమాలో నటీనటులు చాలా పెద్దవాళ్ళే ఉన్నారు. స్క్రిప్ట్ డిమాండ్ చేయడం తో ఎక్కడా రాజీ లేకుండా 8 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని క్వాలిటీ తో నిర్మించారు. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 8 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి. కానీ ఈ సినిమా థియేట్రికల్ రన్ మూడు రోజులకే ముగిసిపోయింది. పాపం నిర్మాతలకు భారీ నష్టాలు కలిగాయి. థియేటర్స్ లో ఎలాగో ఆదరణ దక్కించుకోలేకపోయిన ఈ చిత్రం, ఓటీటీ లో అయినా అమ్ముడుపోతుందో లేదో చూడాలి. ఓటీటీ రైట్స్ ఈమధ్య కాలం లో పెద్ద సినిమాలకే అమ్ముడుపోవడం లేదు. ఇక ఇలాంటి చిన్న సినిమాలు ఎంత వరకు ఉంటాయో చూడాలి.