
విజయవాడ వాంబే కాలనీ డి బ్లాక్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లితో పాటు ఇద్దరు పిల్లలు దారుణ హత్యకు గురైయ్యారు. రక్తపు మడుగులో తల్లి, ఇద్దరు పిల్లలు విగత జీవులుగా పడి ఉన్నారు. నీలవేణి (26) ఝాన్సీ (5) రేవంత్ కుమార్ (7) గా పోలీసులు గుర్తించారు. స్వల్ప గాయాలతో భర్త మోహన్ ఆసుపత్రిలో చేరారు. భర్త పై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.