చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్ గేట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. 10 మంది పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెన్నై నుంచి భక్తులు తిరుమలకు కాలి నడకన వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన అనంతరం లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.