ఈ కోవిడ్ క్లిష్ట సమయంలో నిర్మాతలకు భరోసా ఇచ్చింది ఓటీటీ, బద్దకపు జీవితంలో బాధాకరమైన విషయాల మధ్య నలిగిపోతున్న ప్రేక్షకులకి వినోదాన్ని పంచి పెట్టింది ఓటీటీ. అవును, ఒక్క ఓటీటీ సంస్థలు మాత్రమే నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా థియేటర్ల దగ్గర సందడి చేయాల్సిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో ఆకట్టుకోవడానికి ముస్తాబు అయ్యాయి.
మొత్తానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రాకతో సినిమాలను చూసే విధానమే పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. అసలు భారీ అంచనాలు ఉన్న ఒక స్టార్ హీరో సినిమాని రిలీజ్ రోజే చక్కగా ఇంట్లో కూర్చుని.. నచ్చిన సమయంలో నచ్చినట్టు చూడొచ్చు అని, పైగా బాగా నచ్చిన సీన్ ను మళ్ళీ మళ్ళీ చూస్తూ, అవసరం అయినప్పుడు సినిమా ఆపేసి పని చేసుకుని, మళ్ళీ ఎక్కడ నుండి సినిమా ఆపామో అక్కడి నుండే సినిమాని చూడొచ్చు అని, బహుశా ఏ ప్రేక్షకుడు ఊహించి ఉండదు.
స్టార్ హీరో సినిమాని మొదటి షోలోనే ఈ స్థాయిలో ఎంజాయ్ చేసే వెసులుబాటు ప్రేక్షకుడికి ఇంత త్వరగా కలుగుతుందని సినీ జనం కూడా ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఏది ఏమైనా డిజిటల్ తెర ప్రాచుర్యంలోకి రావడంతో సినిమా విడుదల రూపురేఖలు సంపూర్ణంగా మారిపోయాయి. ప్రేక్షకులు కూడా తమ ఖాళీ సమయాన్ని ఓటీటీలకే కేటాయిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
అందుకే ఓటీటీ సంస్థలు కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం కొత్త కంటెంట్ వస్తోంది ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.