అస్సాం సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మను భాజపా అధిష్టానం సీఎం అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇప్పటికే గువహటిలో అస్సాం భాజపా శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా హిమంతను ఎన్నుకున్నారు. త్వరలో సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం అభ్యర్థి ఎంపికపై భాజపా అధిష్ఠానం పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది.