
హుషారుగా సాగే పాత్రల్లో నటించి దక్షిణాదిన ఫేమస్ అయిన రౌడీ బేబి ‘సాయిపల్లవి’. ఆమె ఏ పాత్ర చేసినా.. సినిమా చేసినా అది హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు సాయిపల్లవి నటించిన సినిమాలన్నీ హిట్ నే.
సాయిపల్లవి తన 29వ పుట్టినరోజును ఈరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం నుంచి సాయి పల్లవి ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. కాళికాదేవి అవతారంలో ఉగ్రరూపం దాల్చినట్లుగా ఉన్న ఈ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
‘ట్యాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ తెరకెక్కుతోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీలో కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ ఎస్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సాయిపల్లవి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపిన హీరో నాని.. శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని సాయి పల్లవి పోస్టర్ ను ట్వీట్టర్ లో షేర్ చేశాడు. ‘హ్యాపి బర్త్ డే చిన్నిగారు’ అని ట్వీట్ చేశాడు.
His ❤️#ShyamSinghaRoy
Happy birthday Chinni gaaru @Sai_Pallavi92 🤗 pic.twitter.com/kW0UBVIugb
— Nani (@NameisNani) May 9, 2021