
సింహాచలం అప్పన్న దర్శనానికి వచ్చిన తనకు తలపాగా కట్టలేదంటూ సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ దర్శనానికి వచ్చిన ఆయనకు, కరోనా పేరు చెప్పి, తలకు తలపాగ చుట్ట లేదని అన్నారు. కాగా మంత్రి ఆదేవాల మేరకు చుట్టలేదని అధికారులు చెప్పారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలకు కూడా ఈ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.