
తెలంగాణలో పలువురు భాజపా ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు నిజామాబాద్ మాజీ మేయర్, ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు ధర్మపురి సంజయ్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత ఎర్ర శేఖర్, భూపాలపల్లి సీనియర్ నాయకుడు గండ్ర సత్యనారాయణ వెల్లడించారు. హైదరాబాద్ లో నేతలు మీడియాతో మాట్లాడుతూ త్వరలో బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ చేరనున్నట్లు ప్రకటించారు.