వైఎస్ షర్మిలను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఉదయం ఉద్రికత్తత నెలకొంది. దీంతో బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉద్రిక్తత నెలకొంది. మొదటగా ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనుమతి నిరాకరించినా నగరంలోని బోడుప్పల్ లో దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం వరకూ దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి తరలివచ్చారు.
తాము శాంతియుతంగా దీక్ష చేయాలకుంటే.. ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించేందుకు తర్వాత ఆమె మేడిపల్లి పీఎస్ కు బయలుదేరారు. అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో షర్మిల, ఆమె పార్టీ కార్యర్తలు రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. విషయం తెలియడంతో మేడిపల్లి పీఎస్ కు వైఎస్సార్ టీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. దీంతో షర్మిలను పోలీసులు ఘటకేశ్వర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
వందల మంది నిరుద్యోగులను పొట్టన పెట్టుకున్న హంతకుడు కేసీఆర్ అని షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామనే తమ దీక్షకు అనుమతి ఇవ్వడంలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి యువత మోసపోయారని అన్నారు. సీఎం కేసీఆర్ వందల మంది నిరుద్యోగుల ప్రాణాలు బలిగొన్న హంతకుడని మండిపడ్డారు. నిరుద్యోగ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు ప్రభుత్వాదినేతల సేవ తప్ప, సామాన్యుల రక్షణ పట్టించుకోవడం లేదన్నారు.