https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ మూడో వారం నామినేషన్ లో ఉన్నది వీళ్లే!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ మూడో వారంలోకి చేరుకుంది. సోమవారం వచ్చిదంటే చాలు రచ్చ రంబోలా అవుతోంది. హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ చినిగి చాటవుతోంది. గొడవలు, కొట్లాటలు, ఆగ్రహ జ్వాలలు.. ఇలా కొట్టుకోవడం ఒకటే తక్కువ అన్నట్టుగా సాగుతోంది. హౌస్ లో ఎమోషన్స్ పీక్ స్టేజీకి చేరుకుంటుండగా.. ప్రేక్షకులకు మాత్రం కావాల్సినంత మజా పంచుతోంది. బిగ్ బాస్ లో అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బాగా ఆడినా, ఆడకపోయినా.. నవ్వించినా.. నవ్వించకపోయినా.. ఏ […]

Written By: , Updated On : September 21, 2021 / 01:39 PM IST
Follow us on

Bigg Boss 5 Telugu: Third Week Nominated Contestants

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ మూడో వారంలోకి చేరుకుంది. సోమవారం వచ్చిదంటే చాలు రచ్చ రంబోలా అవుతోంది. హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ చినిగి చాటవుతోంది. గొడవలు, కొట్లాటలు, ఆగ్రహ జ్వాలలు.. ఇలా కొట్టుకోవడం ఒకటే తక్కువ అన్నట్టుగా సాగుతోంది. హౌస్ లో ఎమోషన్స్ పీక్ స్టేజీకి చేరుకుంటుండగా.. ప్రేక్షకులకు మాత్రం కావాల్సినంత మజా పంచుతోంది.

బిగ్ బాస్ లో అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బాగా ఆడినా, ఆడకపోయినా.. నవ్వించినా.. నవ్వించకపోయినా.. ఏ చిన్న తప్పు చేసినా.. చేయకున్నా సరే కంటెస్టెంట్లు కారణాలు చూపి నామినేట్ చేయాల్సి ఉంటుంది. హౌస్ లోని అందరూ దీన్ని భరించాల్సిందే. ఎప్పుడో ఒకప్పుడు నామినేట్ కావాల్సిందే. ప్రతి సోమవారం దీన్ని చేపడుతారు. అదే రోజు హౌస్ రసాభాసగా సాగుతుంది.

మొదటి వారం బూతులతో రచ్చ చేసిన ‘సరయు’ వెళ్లింది. రెండో వారం అదే బూతు పదాలు వాడిన ‘ఉమాదేవి’ ఎలిమినేట్ అయిపోయింది. ఇక మూడో వారం నామినేషన్ల సందర్భంగా   ‘లహరి’పై నోరుజారి.. ఆమెకు ఎఫైర్లు అంటగట్టిన సీనియర్ నటి ‘ప్రియ’ ఇప్పుడు అందరికీ టార్గెట్ అయ్యింది. ముఖ్యంగా అర్థరాత్రి బాత్రూంలో యాంకర్ రవికి లహరి హగ్ ఇచ్చిందన్న ప్రియ వ్యాఖ్యలు హౌస్ లో రచ్చకు కారణమయ్యాయి. ప్రియ వ్యాఖ్యలను లహరి, యాంకర్ రవి, సన్నీ సహా అందరూ ఖండించి ఆమెపై విరుచుకుపడ్డారు. తిట్టిపోశారు. ప్రియ కూడా ఎక్కడా తగ్గకుండా కౌంటర్ ఇచ్చింది.

సరయూ, ఉమాదేవి వెళ్లిపోవడంతో ఇప్పుడు హౌస్ లో 17 మంది సభ్యులున్నారు. నిన్న నామినేషన్ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. సగం నామినేషన్ వరకే చూపించారు. మంగళవారం మిగతా సగం పూర్తికానుంది. ఈ క్రమంలోనే ఎవరూ నామినేట్ అయ్యారన్నది నిన్న తెలియరాలేదు.

బిగ్ బాస్ నుంచి లీక్ అయిన సమాచారం మేరకు ఈ వారం ‘శ్రీరామచంద్ర, మానస్, ప్రియ, ప్రియాంక సింగ్, లహరి’ నామినేషన్స్ లో ఉన్నారట.. వీరిలో శ్రీరామచంద్ర, లహరిలు తొలిసారి నామినేషన్ లోకి వచ్చారు. ఈ వారం నామినేషన్ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రియ కు ఎలిమినేషన్ ముప్పు ఉందని అంటున్నారు.