Canada: కెనడాలో మళ్లీ ట్రూడోనే.. గెలుపు దిశగా లిబరల్ పార్టీ

Canada: ప్రధాని జస్టిస్ ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ మళ్లీ కెనడాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. తాజాగా జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఆ పార్టీ విజయకేతనం ఎగరవేయనున్నట్లు కెనడాకు చెందిన మీడియా సంస్థలు చెబుతున్నాయి. అయితే కన్జర్వేటివ్ పార్టీ నుంచి తీవ్ర పోటి ఉన్నా ట్రూడోనే మళ్లీ ఆ దేశ ప్రధాని కానున్నారు. ఎరిన్ ఓ టూలూ నేతృత్వంలో కనర్జర్వేటి పార్టీ పోటీలోకి దిగింది. Also Read: కెనడాలో ఘనంగా కార్తీక దీపోత్సవం గత పార్లమెంట్ […]

Written By: Velishala Suresh, Updated On : November 26, 2021 1:06 pm
Follow us on

Canada: ప్రధాని జస్టిస్ ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ మళ్లీ కెనడాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. తాజాగా జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఆ పార్టీ విజయకేతనం ఎగరవేయనున్నట్లు కెనడాకు చెందిన మీడియా సంస్థలు చెబుతున్నాయి. అయితే కన్జర్వేటివ్ పార్టీ నుంచి తీవ్ర పోటి ఉన్నా ట్రూడోనే మళ్లీ ఆ దేశ ప్రధాని కానున్నారు. ఎరిన్ ఓ టూలూ నేతృత్వంలో కనర్జర్వేటి పార్టీ పోటీలోకి దిగింది.

Canada

Also Read: కెనడాలో ఘనంగా కార్తీక దీపోత్సవం

గత పార్లమెంట్ ఎన్నికల్లో 338 స్థానాల్లో లిబరల్ పార్టీ 155 సీట్లు గెలిచింది. అయితే మెజారిటీ కావాలంటే 170 సీట్లు సాధించాల్సిందే. కెనడాలోని తూర్పు ప్రాంతాల్లో పోలింగ్ ముందుగా ముగింది. పశ్చిమ ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ముగిసింది. ప్రధాని జస్టిస్ ట్రూడో తన పార్లమెంటరీ సీటును గెలుచుకున్నారు.

పాపినియో స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. స్వంత జిల్లాకు వెళ్లి ట్రూడో ఓటేశారు. పోల్ వర్కర్లను మెచ్చెకుంటూ ప్రధాని తన ట్విట్టర్ లో కొన్ని ఫోటోలు పోస్టు చేశారు. ఇక ప్రత్యర్థి కన్టర్వేటివ్ నేత ఎరిన్ కూడా తన పార్లమెంట్ స్థానంలో విజయం సాధించారు. ఓంటారియోలోని దుర్హమ్ నుంచి ఆయన పోటీ చేశారు. ఎన్నికలకు ముందు ట్రూడో తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. పది డాలర్లకు చైల్డ్ కేర్, చౌకైన ఇళ్లు, ఆయుధాలపై నిషేధం, గ్రీన్ జాబ్స్, నర్సులు, డాక్టర్లు, మహిళలకు రక్షణ కావాలంటే లిబరర్ పార్టీకి ఓటు వేయాలని ట్రూడో ఆ ట్వీట్ లో కోరారు.

Also Read: కెనడా దేశంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు