నకిలీ పత్రాలతో భూములు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తసుకున్నామని ప్రకటించారు. ప్రధాన నిందితుడు ఆదినారాయణ మూర్తి.. బాధితుడి నుంచి 8.5 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడని, మహేశ్వరంలో 40 ఎకరాల భూమిని చూపించారని తెలిపారు. 264 నకిలీ డాక్యుమెంట్లు, 9 రెవెన్యూ స్టాంప్స్, సీల్స్, 51 పాస్ బుక్ లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆదినారాయణ మూర్తికి 9 రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయని సజ్జనార్ పేర్కొన్నారు.