
చంద్రుడిపైకి వెళ్లిన అపోలో-11 వ్యోమనౌక ఆస్ట్రోనాట్ మైఖేల్ కొలిన్స్ (90) చనిపోయారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. 1969 లో చంద్రుడిపై మానవుడు తొలిసారిగా పాదం మోపిన అపూర్వ ఘట్టంలో కీలక పాత్రధారుల్లో ఆయన ఒకరు. అపోలో మిషన్ లో ప్రయాణించిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లూనార్ ల్యాండర్ ద్వారా చందమామపై పాదం మోపిన విషయం తెలిపారు.