
ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ తో 12 మంది చనిపోయారు. 1,140 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సంఖ్య 20,07,730కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,448గా ఉంది. జిల్లాల వారీగా తాజాగా నమోదైన కొవిడ్ మరణాలు చిత్తూరు, కృష్ణలో ముగ్గురు, ప్రశాశంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒక్కరు మరణించారు.