
పశ్చిమ బెంగాల్ లో గుట్టుచప్పుడు కాకుండా అశ్లీల చిత్రాల వ్యవహారం నడిపిస్తున్న ఓ మోడల్ కమ్ నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. నటి నందితా దత్తా (30) ఒకప్పుడు బిజీ మోడల్. చాలాకాలంగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఛాన్స్ లు దొరక్క బీ గ్రేడ్, చివరికి సెమీ పోర్నోగ్రఫిక్ కంటెంట్ సినిమాల్లో నాన్సీ భాబీ పేరిట నటిస్తూ వస్తోంది. అయితే తనకున్న పరియాలతో యంగ్ మోడల్స్ కు వెబ్ సిరీస్ అవకాశాలను ఎరగా చూపెట్టింది. నీలి చిత్రాల్లో నటించాలని ఒత్తిడి చేస్తూ వస్తోంది. ఈ మేరకు ఇద్దరు బాధితురాళ్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు డమ్ డమ్, నక్ టాలాలోని కొన్ని ఇళ్లలో దాడులు నిర్వహించారు. నక్ టాలాలో తన ఇంట్లో ఓ మోడల్ నగ్నంగా మారాలని బెదిరిస్తున్న టైంలో పోలీసులు నందితాను అడ్డుకుని అరెస్టు చేశారు.