YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ పై మరో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా ఫిబ్రవరి 19 న మిర్చి యార్డుకు వెళ్లారని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు. ఆయనతో పాటు అంబటి రాంబాబు, కావటి మనోహర్ నాయుడు, అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి 41 ఏకింద నోటీసులు ఇచ్చారు. పిలిచినప్పుడు విచారణకు రావాలని సూచించారు. ఇప్పటికే జగన్ పై సింగయ్య మృతి ఘటనపై కేసు నమోదైంది.