Mahesh Babu RRR Fan Edit Trend: సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన నెటిజెన్స్ లో క్రియేటివిటీ ఎక్కువ అయిపోయింది. ఇంతకు ముందు ఒక కొత్త నటీనటులను కానీ, లేదా కొత్త టెక్నీషియన్స్ కానీ తీసుకోవాలంటే మేకర్స్ స్టూడియోస్ లో ప్రత్యేకంగా ఆడిషన్స్ ని నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇన్ స్టాగ్రామ్ లోకి వెళ్తే ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ దొరికేస్తున్నారు. ప్రభాస్(Rebel Star Prabhas), హను రాఘవపూడి(Hanu Raghavapudi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన ఇమాన్వి ఇన్ స్టాగ్రామ్ నుండి వచ్చిన అమ్మాయే. అదే విధంగా ఈ ఏడాది కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన కోర్ట్ చిత్రంలోని హీరోయిన్ శ్రీదేవి కూడా ఇన్ స్టాగ్రామ్ నుండి వచ్చిన అమ్మాయే. ఇలా ఎంతో మంది ఉన్నారు. కేవలం నటులు మాత్రమే కాదు. ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్ కూడా సోషల్ మీడియా లో దొరుకుతున్నారు.
Also Read: Mahesh Babu : మహేష్ బాబు ను నెంబర్ వన్ హీరోగా ఎదగకుండా చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి కొంతమంది ఎడిటర్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా లో ఈమధ్య కాలంలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా #RRR మూవీ ని , మహేష్ బాబు ఖలేజా మూవీ ని కలుపుతూ ఒక క్రాస్ ఓవర్ ఎడిట్ సోషల్ మీడియా లో హల్చల్ చేసింది. మహేష్ బాబు ఖలేజా మూవీ డైలాగ్స్ కి, #RRR మూవీ లోని సన్నివేశాలకు సింక్ చేస్తూ అద్భుతమైన ఎడిటింగ్ ని సోషల్ మీడియా లో వదిలారు. ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి షూట్ చేసినా తియ్యలేరు కదా అంటూ ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. #RRR లోని ఇంట్రడక్షన్ సన్నివేశం, ఇంట్రడక్షన్ ఫైట్ సన్నివేశం, లవ్ సీన్స్, నాటు నాటు డ్యాన్స్, ఇంటర్వెల్ సన్నివేశం, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఇలా ప్రతీ సందర్భం లోనూ మహేష్ బాబు ఖలేజా చిత్రం లోని డైలాగ్స్ ని జత చేశారు.
Also Read: NTR And Ram Charan: రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ లో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి..?
ఈ వీడియో ని క్రింద మీకోసం జత చేస్తున్నాము. చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపం లో తెలియజేయండి. మహేష్ బాబు(Super star Mahesh Babu),ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్(Global Star Ram Charan) కాంబినేషన్ లో సినిమాని ఇప్పట్లో ఎలాగో చూడలేము,కనీసం ఈ ఎడిటింగ్ తో అయినా సంతృప్తి చెందండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోలు తమ తమ సినిమాలతో ఫుల్ బిజీ గా ఉంటున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ‘పెద్ది’ తో,ఎన్టీఆర్ ‘డ్రాగన్’ తో,మహేష్ బాబు రాజమౌళి సినిమాతో ఫుల్ బిజీ గా ఉన్నారు. ఈ మూడు సినిమాలు మన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే సినిమాలే. భవిష్యత్తులో ఈ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఆడుతాలు నెలకొల్పబోతున్నాయి అనేది చూడాలి.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ది బెస్ట్ edit pic.twitter.com/6oTAA69jT1
— Rajesh Manne (@rajeshmanne1) June 23, 2025