
కరోనా రోజుకు వేల మందిని బలి తీసుకుంటుండగా ఇందులో పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. తాజాగా తమిళ నటుడు నితీశ్ వీరా (45) కరోనాతో కన్నుమూశాడు. అసురన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నితీశ్ పేరరుసు వెన్నిల కబడి కుళు, పుదు పేట్టే, వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు. రీసెంట్ గా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రూపొందుతున్న లాభంతో పాటు నీరో చిత్రంలోను నటించారు. నితీశ్ అకాల మరణంపై సినీ పరిశ్రమ దిగ్భ్రంది వ్యక్తం చేసింది.