టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత్ జట్టులో షాకింగ్ మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే టీ20 ఫార్మాట్ లో కెప్టెన్సీ కి విరాట్ కోహ్లీ గుడ్ బై పలుకుతున్నట్లు గా ప్రకటించగా కొత్త కోచ్ సారథ్యంలో మ్యాచులో ఆడనుంది భారత జట్టు. తాజాగా అనికుంబ్లే మరోసారి టీమిండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టాలంటూ బీసీసీఐ అతన్ని కోరినట్లు అనధికారిక రిపోర్ట్స్ ద్వారా తెలిసింది.
ఇంతకముందు అనిల్ కుంబ్లే టీమిండియాకు కోచ్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ, కుంబ్లే మధ్య విభేదాలు బయటపడ్డాయి. కుంబ్లే ఆలోచన విధానంతో కోహ్లికి పొసగలేదు. జట్టు ఎంపికలో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. దీతో ఏడాది కాంట్రాక్ట్ కన్నా ముందే కుంబ్లే అర్ధంతరంగా కోచ్ పదవి నుంచి పక్కకు తప్పుకున్నాడు. 2016లో ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో అనిల్ కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలను స్వీకరించాడు.
ఏడాది కాలానికి గానూ కుంబ్లే కోచ్ పదవిలో ఉంటారని బీసీసీఐ మేనేజె మెంట్ తెలిపింది. అయితే 2017 జనవరిలో ధోని పరిమిత ఓవర్ల నుంచి కెప్టెన్ గా వైదొలిగాడు. ఇప్పటికైతే కుంబ్లే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ.. కోహ్లీతో విభేదాల కారణంగానే పదవికి రాజీనామా చేశాడు. మరి కుంబ్లే కోచ్ పదవికి ఆసక్తి చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక కుంబ్లేతో పాటు వివిఎస్ లక్ష్మణ్ కూడా టీమిండియా కోచ్ పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.