Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh heat wave :ఈరోజు ఈ ప్రాంతాల్లో బయటకు రావద్దు.. తప్పనిసరి అయితే ఈ...

Andhra Pradesh heat wave :ఈరోజు ఈ ప్రాంతాల్లో బయటకు రావద్దు.. తప్పనిసరి అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Andhra Pradesh heat wave : ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజు రోజుకీ మండిపోతున్నాయి. ఏప్రిల్ 15న రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలను దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మొత్తం 33 మండలాల్లో తీవ్ర వడగాలులు (హీట్ వేవ్) వీస్తాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా మరో 44 మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రత్యేకంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం అత్యంత ముఖ్యమని అధికారులు సూచిస్తున్నారు. ఈ సమయంలో సూర్యరశ్మి తీవ్రంగా ఉండటంతో హీట్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితులు తప్పితే బయటకు వెళ్లకపోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు.

ఇక రాయలసీమలో ఎండలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. కడప జిల్లాలో గరిష్ఠంగా 44.4 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇతర రాయలసీమ జిల్లాల్లో కూడా 42 సెంటిగ్రేడ్ నుంచి 44 సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు.

విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను ప్రజలు గమనించి, తగిన జాగ్రత్తలు పాటిస్తే వడగాలుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్–మే నెలల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో అవసరం లేకపోతే బయటకు వెళ్లకపోవడం మంచిది.రోజంతా తరచూ నీళ్లు తాగాలి. దాహం లేకపోయినా కూడా నీరు తీసుకోవడం అవసరం. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.లైట్ కలర్, కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిది. ఇవి చెమటను త్వరగా ఆరబెట్టడంలో సహాయపడతాయి.బయటకు వెళ్లేటప్పుడు టోపీ, గుడ్డ లేదా అంబ్రెల్లా ఉపయోగించాలి. కళ్లకు సన్‌గ్లాసెస్ వాడటం మంచిది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version