Homeఅంతర్జాతీయంStrait Of Hormuz Crisis Impact On Global Oil Supply: ఇరాన్ వద్ద హర్మోజ్.....

Strait Of Hormuz Crisis Impact On Global Oil Supply: ఇరాన్ వద్ద హర్మోజ్.. భారత్ వద్ద మలక్కా.. ఈ జలసంధిని అడ్డుకుంటే ఏం జరుగుతుందంటే..

Strait Of Hormuz Crisis Impact On Global Oil Supply: అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం తో హర్మోజ్ లో అలజడి నెలకొంది. ఈ ప్రాంతాన్ని మొన్నటి వరకు ఇరాన్ చేతిలో ఉంటే ఇప్పుడు.. తాము దిగ్బంధించామని అమెరికా చెబుతోంది. ఈ రెండు దేశాల మధ్య వైరంతో ప్రపంచవ్యాప్తంగా చమరు సమస్యలు నెలకొన్నాయి. ఎందుకంటే వివిధ దేశాలకు 20% చమురు ఇక్కడి నుంచే రవాణా కావాల్సి ఉంది. హర్మోజ్ జలసందికి అవతల వైపు యూఏఈ, ఇరాక్, కువైట్, ఖతార్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లోనే ఎక్కువగా చమురు ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయిన చమురు తూర్పు ఆసియా దేశాలకు సరఫరా కావడానికి ఈ జల సంధినే ప్రధాన రవాణా వ్యవస్థగా ఉంటుంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో కొత్త చర్చ వస్తుంది. భారతదేశానికి సమీపంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి కీలకమైన జల సంధి లు ఉన్నాయి. ఒకవేళ భారత్ కూడా ఇరాన్, అమెరికా లాగా జల సంధి లు కట్టడి చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే అవకాశం ఉంది. అలాంటి మార్గాలు ఏవంటే?

వాణిజ్య వ్యవస్థ తూర్పు, పశ్చిమ దేశాల మధ్య నిత్యం సంబంధాలను కలిగి ఉంటుంది. అమెరికా, గల్ఫ్ వంటి దేశాల నుంచి చమురు, ఇతర సరుకులు రవాణా కావాలంటే హార్మోజ్ జల సంధి ఎంత ముఖ్యమో.. తూర్పు ఆసియా దేశాల నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లడానికి మలక్కా జల సంధి కూడా అంతే ప్రాముఖ్య్యాన్ని కలిగి ఉంది. ఈ జల సంధి పై భారత్ అధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇండోనేషియా సుమత్ర, మలేషియా, సింగపూర్ దేశాల మధ్య ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లో మలక్కా జల సంధి కనిపిస్తుంది. నికోబార్ లోని చివరి దీవి కెంపుబెల్ ఐ ఎన్ ఎస్ బాజ్ ఉంది. ఇది భారత్ కు చెందిన నౌకాదళ కేంద్రం. ఇక్కడ ఉండే మన నేవీ అధికారులు నిత్యం మలక్కా జలసంధి పై కన్నేసి ఉంచుతారు. తూర్పున ఉన్న చైనా, ఇతర దేశాల నుంచి రష్యా, అమెరికాకు నౌకా రవాణా వ్యవస్థకు ఇదే ప్రధాన మార్గం. ఈ జల సంధి నుంచి ప్రతి ఏడాది లక్ష వరకు నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి.మరోవైపు లక్షద్వీప్ సమీపంలో కూడా అంతర్జాతీయ జలమార్గాలు ఉన్నాయి. పచ్చిమాసియా, ఐరోపా దేశాలకు ఇదే ప్రధాన మార్గం. ఇక్కడ కూడా భారత ప్రభుత్వం మినీ కాయి దీవిలో ఐఎన్ఎస్ జటాయు అనే నౌకాదళ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

ప్రస్తుతం హర్మోజ్ లో నెలకొన్న సమస్యలతో చమురు రవాణా ఆగిపోయింది. కానీ భారత్ కనుక ఈ జల మార్గాలపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించి రవాణా వ్యవస్థను అడ్డుకుంటే తూర్పు, పశ్చిమ దేశాల మధ్య అలజడి నెలకొనే అవకాశం ఉంది. అందుకే అటు అమెరికా.. ఇటు చైనా దేశాలు భారత్ విషయంలో కొన్నిసార్లు నిలకడగా ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper
Exit mobile version