Anasuya vs Sivaji : నటుడు శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నాడు. కోర్ట్ మూవీలో చేసిన మంగపతి క్యారెక్టర్ కు మంచి పేరు వచ్చింది.ఆయన ఆ పాత్రను పోట్రే చేసిన విధానం బాగుంది. ఇక అలాంటి శివాజీ రీసెంట్ గా హీరోయిన్ల మీద వాళ్లు వేసుకునే డ్రెస్సుల మీద కామెంట్లు చేశాడు. అలాగే కొన్ని బూతులు కూడా వాడాడు. ఇక ఆ మాటలు గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీని మీద పలువురు సినిమా సెలబ్రిటీలు సైతం స్పందించారు. ముఖ్యంగా అనసూయ చేసిన కామెంట్లు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి… లేడీస్ నుంచి శివాజీ మీద వ్యతిరేకత రావడంతో చేసేదేం లేక శివాజీ క్షమాపణ చెప్పాడు. అలాగే తను ఎందుకు అలా అన్నాడో క్లారిటీ ఇచ్చే ప్రయత్న చేశాడు.ఆయన చెప్పిన సారీ మీద సైతం అనసూయ కౌంటర్ వేసింది… రీసెంట్ గా ఆమె ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియోలో అనసూయ శివాజీని ఉద్దేశిస్తూ ఏం మాట్లాడిందంటే అవతలి వాళ్లు బట్టలు ఎలా వేసుకోవాలి? అనేదాని గురించి మీకెందుకు చెబుతున్నారు. మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలని మేము చెబుతున్నామా? అన్నారు అలాగే మొన్న కామెంట్లు చేసినప్పుడు మీ వాయిస్ రైజ్ లో ఉంది. చేసిన కామెంట్లకు సారీ చెప్పేటప్పుడు మాత్రం మీ వాయిస్ తగ్గుముఖం పట్టింది. నీ మీద మీరు సింపతీని రాబట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కామెంట్లు చేశారు. అలాగే నన్ను ఉద్దేశిస్తూ కూడా మాట్లాడారు. నేను ఈ మ్యాటర్ లోకి ఎందుకు ఎంటర్ అయ్యాను అంటూ కూడా మీరు మాట్లాడారు. నేను సెలబ్రిటీని, నేను సినిమాల్లో నటిస్తున్నాను. క్యారెక్టర్ డిమాండ్ ను బట్టి కొన్ని సార్లు కాస్ట్యూమ్స్ ను వేసుకుంటాం. అలాగే బయట కూడా అలానే కనిపించాల్సిన పరిస్థితిలు ఏర్పడతాయి. అలాంటి దానికి మీరు ఆడవాళ్లు బట్టలు ఎలా వేసుకోవాలి? హీరోయిన్లు ఎలా ఉండాలి? అనేదానిమీద కామెంట్స్ చేయడం, క్లాస్ లు తీసుకోవడం సరైనది కాదు అంటూ ఆమె మాట్లాడారు…
సమాజంలో నిజమైన ఫెమినిస్టులు ఉన్నారు? అసలు ఫెమినిస్టు అంటే ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు సమానమని భావించేవారు…కొంతమంది మగవాళ్లు ఆడవాళ్లను అణిచి వేయాలని చూస్తారు. ఇక చాలామంది ఫేక్ ఫెమినిస్ట్ లు కూడా ఉన్నారు. బయటికి మగాళ్ళు, ఆడవాళ్లు సమానమని చెప్పిన కూడా ఆడవాళ్లు మా కంటే తక్కువే అనే ఒక చులకన భావం అయితే వాళ్ళలో ఉంటుంది.
అది మీలో కూడా నాకు కనిపించింది అంటూ శివాజీని ఉద్దేశించి ఆమె మాట్లాడారు… అలాగే నన్ను ఉద్దేశిస్తూ అనసూయ నా మీద జాలి చూపించినందుకు థాంక్స్ అని చెప్పారు. అది జాలి కాదు. ఒక రకమైన భావన అంటూ ఆమె సమాధానం చెప్పారు. అలాగే నేను ఏదైనా ప్రాబ్లం లో ఇరుక్కునప్పుడు మీరు కూడా నా వైపు సపోర్టుగా మాట్లాడతానని చెప్పారు.
నాకు మీ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక స్ట్రాంగ్ ఉమెన్ ను. దీని మీదైన కాన్ఫిడెంట్ గా పోరాడే దమ్ము నాకుంది. స్ట్రాంగ్ మెంటాలిటి ఉన్న భర్త నా వెనకాల ఉన్నాడు. ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కాబట్టి నాకు మీ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం రాకపోవచ్చు అంటూ అనసూయ శివాజీ మీద రెస్పెక్ట్ గా మాట్లాడుతూనే కౌంటర్స్ వేశారు…
నటుడు శివాజీపై మరోసారి అనసూయ సంచలన కామెంట్స్! pic.twitter.com/WH5pMu3w5V
— ChotaNews App (@ChotaNewsApp) December 24, 2025