Shambhala Movie Highlights ఈ ఏడాది అత్యధిక శాతం చిన్న సినిమాల మేనియా నే కనిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించనంత వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఈమధ్య కాలం లో సర్వ సాధారణం అయిపోయింది. ఆడియన్స్ ప్రస్తుతం కంటెంట్ ని మాత్రమే చూస్తున్నారు. సినిమా ఎలా నటీనటులను చూసి గుడ్డిగా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లే రోజులు పోయాయి. అలా చిన్న సినిమాగా తెరకెక్కిన ‘శంబాలా'(Sambhala Movie) చిత్రం టీజర్, ట్రైలర్ నుండే ఆడియన్స్ దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది. ఆది సాయి కుమార్ ఈసారి కచ్చితంగా పెద్ద హిట్ కొట్టేలాగానే ఉన్నాడు అని బలమైన నమ్మకాన్ని విడుదలకు ముందే ఇచ్చింది ఈ చిత్రం. అలా మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ని ఏమేరకు అలరించిందో ఒకసారి చూద్దాం.
దైవ శక్తికి , సైన్స్ కి మధ్య జరిగే యుద్ధం లాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్. రొటీన్ కి భిన్నంగా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో, ఎక్కడ డీవియేషన్స్ లేకుండా చాలా చక్కగా తెరకెక్కించారట. ఈమధ్య కాలం లో చిన్న హీరో, పెద్ద హీరో అని తేడా లేకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఇష్టమొచ్చినట్టు దూర్చేసి సినిమాలను నాశనం చేస్తున్నారు డైరెక్టర్స్, కానీ ఈ చిత్రం లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా, కేవలం కంటెంట్ తో ఇంత చక్కగా సినిమాని తీయొచ్చా అని చూసే ఆడియన్స్ అంటున్నారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి, సన్నివేశాన్ని పైకి లేపడం కోసం ఓవర్ గా లేకుండా, చాలా నేచురల్ గా ఉండేలా, నీట్ గా ఉందట. అదే విధంగా నటీనటుల నటన కూడా చాలా నేచురల్ గా ఉందట. విజువల్స్ ఇంత తక్కువ బడ్జెట్ లో ఈ రేంజ్ లో చూపిస్తారని అసలు ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
కథ రీత్యా సినిమా స్క్రీన్ ప్లే స్లో గానే ఉంటుందట, కానీ సన్నివేశాలు మాత్రం చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయని అంటున్నారు. అంతే కాకుండా భారీ లాండ్ డైలాగ్స్, సహజత్వానికి దూరంగా ఉండే ఎమోషన్స్ ఈ సినిమాలో అసలు కనిపించవట. అంతే కాదు సినిమాలో నిశబ్దం ఒక ముఖ్యమైన క్యారక్టర్ లాగా అనిపిస్తాడట. డైరెక్టర్ ఆ విధంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడని అంటున్నారు. ఓవరాల్ గా కొత్త ధనాన్ని ఇష్టపడే ఆడియన్స్ కి ఈ చిత్రం తెగ నచ్చేస్తుంది. టాక్ బాగా రావడం తో ఓపెనింగ్స్ కూడా నేడు విడుదలైన అన్ని సినిమాలను డామినేట్ చేస్తోంది. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఏ మేరకు థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
Watched #Shambhala
Movie started pretty well with good interval sequence, making good 1st half
Latter half okay with few twists but felt like hurried towards climax.
Adequate music with few jump scaresPerformance-wise @iamaadisaikumar didn’t realise is right behind. pic.twitter.com/YzpxEVPauA
— Dilip Kumar (@DiliKadiyala) December 25, 2025