
అమెరికాను బహిరంగంగా సవాల్ చేసేందుకు చైనా వెనుకాడటం లేదు. ఒక వేళ యుద్ధం వస్తే అమెరికా ఓటమి తప్పదని చైనా స్పష్టం చేసింది. చైనా అధికారిక వార్త పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయంలో ఈ విషయాలను రాసింది. చైనాను సూపర్ పవర్ అని అభివర్ణించింది. ఈ వార్త పత్రిక పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మౌత్ పీస్ గా పరిగణిస్తుంటారు. ఇందులో ప్రచురించిన విషయాన్ని ప్రభుత్వ ప్రకటనగా పరిగణలోకి తీసుకుంటారు. జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ సైనిక విన్యాసాలలో అమెరికా ప్రమేయంపై గ్లోబల్ టైమ్స్ ఈ సందపాదకీయంలో పేర్కొన్నది.