America: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాా యూఎస్ కు వచ్చే 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధించారు. బుధవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులను పై ఆయన సంతకం చేశారు. కొలరాడోలో ఇటీవల యూదులపై పై సీసాబాంబులతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్, ఇరాన్, యెమెన్, మయన్నార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియో, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సుడాన్, దేశాలు ఈ నిషేద జాబితాలో ఉన్నాయి.