Homeఎంటర్టైన్మెంట్Balayya 30-year-old dream come true : బాలయ్య 30 ఏళ్ల కల నెరబరబోతుందా? అభిమానులకు...

Balayya 30-year-old dream come true : బాలయ్య 30 ఏళ్ల కల నెరబరబోతుందా? అభిమానులకు అతిపెద్ద సర్ప్రైజ్!

Balayya 30-year-old dream come true : బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆయన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. బాలయ్య నటించిన అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ప్రస్తుతం ఆయన అఖండ 2లో నటిస్తున్నారు. అటు రాజకీయంగా కూడా బాలయ్య సక్సెస్ ట్రాక్ లో పరుగులు పెడుతున్నారు. వరుసగా మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. బాలయ్య సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అభిమానులను ఓ విషయం మాత్రం ఇబ్బంది పెడుతుంది. అదే మోక్షజ్ఞ ఎంట్రీ. బాలయ్య నటవారసుడిగా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. మోక్షజ్ఞ పుట్టినప్పుడే ఫ్యాన్స్ అలా ఫిక్స్ అయ్యారు. హీరోల కుమారులు హీరోలు కావడం ఆనవాయితీగా ఉంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందినవారే.

మూడు పదుల వయసులో ఉన్న మోక్షజ్ఞ ఎంట్రీ చాలా ఆలస్యమైంది. ఎట్టకేలకు దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ సెట్ అయ్యింది. అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. 2024 డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లాల్సిన మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్ లేదు. ప్రశాంత్ వర్మతో తలెట్టిన విబేధాలు కారణంగా ఈ ప్రాజెక్ట్ రద్దు అయ్యిందనే వాదన ఉంది. ఈ కథనాలు బాలయ్య ఫ్యాన్స్ ని ఆవేదనకు గురి చేస్తున్నాయి.

Also Read : ‘గద’ కోసం బాలయ్య, బోయపాటి మధ్య మనస్పర్థలు..విషయం ఎంత దూరం వెళ్లిందంటే!

కాగా జూన్ 10న బాలకృష్ణ 65వ జన్మదినం. ఆ రోజు మోక్షజ్ఞ మూవీపై బాలకృష్ణ అప్డేట్ ఇవ్వనున్నాడట. తానే స్వయంగా రాసిన ఆదిత్య 999 తో మోక్షజ్ఞను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడట. క్రిష్ దర్శకత్వంలో ఆదిత్య 999 తెరకెక్కనుందట. ఈ చిత్రంలో బాలయ్య కూడా నటిస్తాడు అని సమాచారం. ఆదిత్య 369కి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందిస్తున్నారన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ జన్మదినం వేళ మోక్షజ్ఞ డెబ్యూ పై భారీ అప్డేట్ రానుందని పరిశ్రమలో గట్టిగా వినిపిస్తుంది. ఇది బాలయ్య 30 ఏళ్ల కల. అలాగే అభిమానులు ఏళ్ల నిరీక్షణ అని చెప్పొచ్చు.

మరోవైపు బాలయ్యకు ఇది 65వ జన్మదినం కావడంతో అభిమానులు మరింత ఘనంగా జరుపుకోనున్నారు. వరల్డ్ వైడ్ బాలయ్య అభిమానులు సంబరాలకు సిద్ధం అవుతున్నారు. అఖండ 2 నుండి ఖచ్చితంగా అప్డేట్ ఉంటుందని సమాచారం. అలాగే బాలకృష్ణ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ నుండి సమాచారం అందే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular